కోలీవుడ్ స్టార్
హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్
మూవీ వారిసు. తెలుగులో ఈ మూవీని వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు.
టాలీవుడ్ టాప్
డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో కన్నాడా హాట్
బ్యూటీ రష్మిక మందన్న
హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ స్టార్
ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ
మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ
సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా చాట్ బస్టర్ గా నిలిచాయి.
యూట్యూబ్ లో ఈ రెండు పాటలు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. పేరుకే
తమిళ సినిమా అయినప్పటికీ మన దగ్గర కూడా భారీ అంచనాలే ఉన్నాయి.తాజాగా ఈ
సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ
మూవీ రాబోతుంది. తాజాగా విడుదలైన
మూవీ ట్రైలర్ బాగా వైరల్ అవుతూ సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. విడుదల అయిన కేవలం 20 నిమిషాల్లోనే ఏకంగా 2.2 మిలియన్ వ్యూస్ ను సాధించింది ఈ ట్రైలర్.
ఈ
మూవీ కోసం
విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే
విజయ్ గత
సినిమా బీస్ట్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో
విజయ్ ఓ పెద్ద మిలియనీర్ కుటుంబానికి చెందిన చిన్న కొడుకు గా చూపించారు.
విజయ్ ఇంటికి దూరంగా తనకు నచ్చిన ప్రపంచంలో బ్రతుకుతుంటాడు.తన కుటుంబానికి బిజినెస్ లో శత్రువులు పెరిగారని తెలిసి
విజయ్ వచ్చి ఆ సమస్యలని సాల్వ్ చేస్తాడు. ఇంకా అదే సమయంలో మనస్పర్థల కారణంగా విడిపోయిన తన కుటుంబాన్ని కూడా కలుపుతాడు. ఇదే పాయింట్ ఈ ట్రైలర్ లో చూపించారు. దాంతో ఈ
మూవీ ఎలా ఉండబోతుంది అన్నది క్లారిటీ వచ్చేసింది. మరి ఈ
సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.