సింగర్ కనకవ్వ.. ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రకాల ట్రెండ్లు కొనసాగుతున్నప్పటికీ అటు జానపద గీతాలకు మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన క్రేజీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకో జానపదాలను వినడానికి అటు ప్రేక్షకులందరూ అమితమైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇకపోతే నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో  మట్టిలో మాణిక్యాల లాంటి జానపద గాయకులు ఎంతోమంది తెరమీదికి  వస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వారిలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది కనకవ్వ. ఇప్పుడు జానపదం అనే పేరు వినిపించగానే అందరికీ కనకవ్వ పేరే గుర్తుకు వస్తుంది అని చెప్పాలి.



 ఎన్నో రోజుల నుంచి జానపద గాయకురాలిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆరుపదుల  వయస్సు దాటిన తర్వాత మాత్రం తన గాత్రంతో సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఇప్పుడు ఎన్నో మంచి పాటలు పాడుతూ ఎక్కువ ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు.ఇక ప్రేక్షకులు ఎవరైనా సరే కనకవ్వ  పాట విన్నారు అంటే చాలు ఆమెకు ఎంత పారితోషకం ఇచ్చిన కూడా తక్కువే అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి.. అయితే ఒకప్పుడు 2 నుంచి 3000 వరకు ఒక పాటకి పారితోషకం తీసుకుందట కనకవ్వ.


 ఇప్పుడు కనకవ్వ పాడిన పాటలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పారితోషకం కూడా కాస్త పెంచేసినట్లు తెలుస్తోంది. ఏకంగా జనాల్లో ఆమె ఆదరణకు తగ్గట్లుగానే వారితోషకం తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక్కరోజు లేదా హాఫ్ డే కాల్ షీట్ కోసం కనకవ్వ ఏకంగా 50,000 వరకు పారితోషకం  తీసుకుంటుందట. ఎందుకంటే కనకవ్వ స్టేజి మీద కనిపించింది అంటే చాలు ఎపిసోడ్ వదలకుండా చూసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. యూట్యూబ్లో ఆమె పాడిన పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అందుకే ఇక ఈ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: