సాధారణంగా తమ అభిమాన
హీరో లేదా
హీరోయిన్ గురించి తెలుసుకోవడానికి వారి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అందులో భాగంగానే వారికి సంబంధించిన పాత ఫోటోలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు అభిమానులు. అయితే ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా మారాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.చిరంజీవి లాక్ డౌన్ సమయంలో విరాళాలు పోగు చేసి
సినిమా కార్మికుల కడుపు నింపిన సంగతి మనందరికీ తెలిసిందే.మెగాస్టార్
చిరంజీవి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోల అందరికీ గురువు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
చాలామంది
మెగాస్టార్ చిరంజీవి మా రోల్ మోడల్ అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది స్టార్ హీరోలు సైతం చిరంజీవిలా డాన్స్ చేయాలని ఉంది.. ఆయన మాదిరే యాక్టింగ్ చేయాలని ఉంది ..ఆయనలాగా ఫైట్ చేయాలని ఉంది ...అంటూ చెప్తుంటారు. ఇక అలాంటి
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా దండం వేయించుకొని
షీల్డ్ అందుకున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుస్తే షాక్ అవుతారు.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆ బుడ్డోడు కూడా ఒక హీరోనే.అంతేకాదు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారసుడు ఈ బుడ్డోడు. ఇక తను ఎవరో కాదు
కింగ్ సాయికుమార్ కొడుకు ఆది.
అయితే తాజాగా ఈ జ్ఞాపకాన్ని
ఆది తన సోషల్
మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. అందులో భాగంగానే చిరంజీవితో ఆదికున్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అది షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది.ఇక
ఆది సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అది రెండు సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు ఇంతకాలం తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన ఈయన ప్రస్తుతం కన్నడలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు అయితే అప్పట్లో చంద్రమోహన్ మరియు
జయసుధ జంటగా నటించిన చలికాలం
సినిమా సమయంలో ఈ ఫోటోను దిగడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాలో
సాయికుమార్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ
సినిమా 100 రోజుల ఫంక్షన్ కి
మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రావడంతో
సాయికుమార్ కి
షీల్డ్ ను అందించారు.
చిరంజీవి ఆయన కొడుకుకి ఇస్తూ
చిరంజీవి అప్పట్లో ఫోటో దిగడం జరిగింది..!!