రామ్ చరణ్ ఒక్క సినిమాకి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను పొందడు రామ్ చరణ్. ఈ సినిమా లో ఆయన నటనతో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కి ఏదైనా ఒక మంచి విషయం జరిగింది అంటే అది రామ్ చరణ్ స్టార్స్ రెమ్యూనరేషన్ కు సంబంధించి 100 కోట్ల క్లబ్ లోకి చేరడమే. ఈ సినిమా అనంతరం  రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్  ఇద్దరు స్టార్ హీరోలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల సినిమాకి ఓకే చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా రాలేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రిబుల్ ఆర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి గాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల రెమ్యూనిరేషన్ను తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని పాటల చిత్రీకరణకు సంబంధించి కోట్ల రూపాయలను ఖర్చు చేశారట చిత్ర బృందం. ఈ సినిమా వర్కింగ్ డేస్ కూడా చాలా ఎక్కువ అని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందట. అయితే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ కి ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 100 కోట్ల క్లబ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఉన్నారు.అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలోనే ఈ క్లబ్లో చేరతాడని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఆయన ఒక సినిమాకి  60 కోట్ల కి పైగానే రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నాడు. త్వరలోనే రాజమౌళి తో కూడా ఒక సినిమా చేయనున్నాడు మహేష్ బాబు .ఇక ఆ సినిమాకి కచ్చితంగా మహేష్ బాబు 100 కోట్లు తీసుకుంటాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: