ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల..!?

Anilkumar
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ  ఇచ్చిన శ్రీ లీల  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును పొందిన ఈమె దాని అనంతరం స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో రవితేజ సరసర హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఒకసారిగా స్టార్ హీరోయిన్ గుర్తింపును పొందింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా హిట్లు అందుకోవడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేస్తుంది ఈమె. 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ అందరినీ పక్కనపెట్టి శ్రీ లీల ని హీరోయిన్ గా తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు సినీ దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ల చేతుల్లో కేవలం ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఏకంగా 7, 8 సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. అయితే తాజాగా శ్రీ లీలకి ఒక స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో శ్రీ లీలా ని హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ తో ఈమె జత కడితే బాగుంటుందా లేదా అన్న చర్చలు సైతం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నేరుగా పవన్ కళ్యాణ్ ని శ్రీలీలను ఈ సినిమాలో నటిస్తావా అని అడిగారట. ఇక ఈ వార్త విన్నాను శ్రీ లీల కూడా ఎంతో సంతోష పడిందని తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తే ఆమె రేంజ్ మరింత పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వార్త విన్న అనంతరం చాలామంది విశ్లేషకులు ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా అనంతరం ఆమె దశ మారిపోతుంది అని అంటున్నారు. ఇక సుజిత్ మరియు పవన్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాలో శ్రీ లీల నటిస్తుందా లేదా అన్న విషయం తెలియాలి అంటే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: