పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్
కళ్యాణ్ హరిహర వీరమల్లు
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ పాన్
ఇండియా మూవీ గా రూపొందుతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ
మూవీ లో ...
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం
కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే ఈ
సినిమా విడుదల కాకముందే పవన్
కళ్యాణ్ ...
సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాకు ...
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ...
సముద్ర ఖని దర్శకత్వంలో మరో
మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ హీరోగా తేరకెక్కిన సినిమాలను వరుసగా రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం కృతమే పవన్
కళ్యాణ్ కెరియర్ లో సూపర్ హిట్ గ నిలిచినటు వంటి
జల్సా మూవీ ని 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేశారు. ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా పవన్
కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్
మూవీ అయినటువంటి
ఖుషి మూవీ ని కూడా 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే పవన్
కళ్యాణ్ కెరియర్ లో
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ తన లుక్స్ తో ... డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన
పంజా మూవీ ని కూడా రీ రిలీజ్ చేయబోతున్న ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.