అజిత్ మనసును కదిలించిన ఆ ఘటన.. అందుకే 10 సంవత్సరాలుగా ప్రమోషన్స్ కి దూరం..?

Anilkumar
తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా అజిత్ కుమార్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. దాంతో తెలుగులో కూడా అజిత్ కి సూపర్ ఫ్యాన్ వబేస్ ఏర్పడింది. ఇక ఇటీవల వాలిమై అనే సినిమాతో సందడి చేసిన అజిత్.. తాజాగా 'తునివు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో ఈ సినిమాని 'తెగింపు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుండడంతో  తమిళనాడులో ఫాన్స్  రచ్చ అప్పుడే మొదలైంది. అయితే తునివు విడుదల అవుతున్న రోజే మరో తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారిసు' కూడా విడుదలవుతోంది. దీంతో ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రచార కార్యక్రమాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

ముఖ్యంగా విజయ్ ఇప్పటికే ప్రమోషన్స్ లో పాల్గొంటూ గత కొన్ని రోజులుగా తన ఫ్యాన్స్ ని కలుస్తున్నాడు. మరోవైపు అజిత్ మాత్రం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ లో మాత్రం అస్సలు కనిపించడం లేదు. సుమారు పది సంవత్సరాల నుంచి అజిత్ తన సినిమా ప్రచారాల్లో పాల్గొనడం లేదు. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు. అదేంటంటే.. సహజంగా తమిళనాడులో ఫ్యాన్స్ మధ్య వార్ అనేది జరుగుతూ ఉంటుంది.తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆ రచ్చ వేరే లెవెల్ లో ఉంటుంది. గతంలో అజిత్, విజయ్ హీరోల అభిమానులు రోడ్లపైనే గొడవపడ్డారు.

మొదట చిన్నగా మొదలైన ఈ వివాదం కాస్త ఆ తర్వాత చాలా పెద్దగా మారి కొట్టుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మృతి చెందాడు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి అజిత్ సినిమా ప్రమోషన్లు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఆపాలని.. ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఉండాలని అలా జరగాలంటే తాను వ్యక్తిగతంగా ప్రమోషన్స్ లో పాల్గొనకూడదని అజిత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటినుంచి సినిమాలు పూర్తి చేయడం ఆ తర్వాత ఎలాంటి ప్రమోషన్స్లో పాల్గొనకపోవడం జరుగుతుంది. ప్రమోషన్ లే కాదు అటు సోషల్ మీడియా కూడా అజిత్ దూరంగానే ఉంటారు. ఇవన్నీ ఉన్నా లేకున్నా తనకు అభిమానుల ప్రేమ, ఆశీస్సులు మాత్రం ఎప్పటికీ ఉంటాయని అంటుంటాడు ఈ కోలీవుడ్ హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: