సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో భారీ స్టార్ డం తెచ్చుకున్నాడు అంటే ఆ హీరో కుటుంబం గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే స్టార్ డం ఉన్న సెలబ్రిటీలు కూడా చాలామంది లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకవైపు స్టార్ డైరెక్టర్గా గుర్తింపును తెచ్చుకున్న కూడా యంగ్ హీరో అడివి శేష్ సోదరుడు మాత్రం ఇప్పటికే ఇంకా లో ప్రొఫైల్ మెయింటెన్ చేయడం గమనార్హం. ఇది ఒక విధంగా ఆయన సింప్లిసిటీకే నిదర్శనం అని చెప్పవచ్చు. హీరో అడివి శేష్ బ్రదర్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ ఈ విషయం చాలామందికి తెలియదు.
ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు సాయికిరణ్ అడివి. ఇతను కృష్ణుడు హీరోగా నటించిన 'వినాయకుడు' అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. మన క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఆయన దగ్గర దర్శకత్వంలో మెలకువలు నేర్చుకొని 2008 సంవత్సరంలో వినాయకుడు అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. మొదటి సినిమాతోనే ఘనవిజయం అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాకి తానే స్వయంగా కథ రాసి డైరెక్ట్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాకి గాను అతనికి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు కూడా లభించింది. ఇక ఆ తర్వాత వినాయకుడి సినిమాకి సీక్వెల్ గా విలేజ్ లో వినాయకుడు అనే సినిమాని డైరెక్ట్ చేయడమే కాకుండా స్వయంగా తానే నిర్మించాడు.
అలా అప్పటినుంచి తన సినిమాలకు తానే కథలు రాస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక అడివి శేష్ హీరోగా 2013లో తెరకెక్కిన 'కిస్' అనే సినిమాను సైతం తెరకెక్కించాడు సాయికిరణ్. అయితే ఆ సినిమా మాత్రం యావరేజ్ గా ఆడింది. ఇక తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని సాయికిరణ్.. ఆ తర్వాత 'కేరింత' అనే మూవీని డైరెక్ట్ చేశాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత 2019లో ఆది సాయికుమార్ హీరోగా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే సినిమాని తీశాడు. ఇక ప్రస్తుతం కూడా కొన్ని కథలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ సాయికిరణ్ అడివి శేష్ కి సొంత సోదరుడు కాదు. పెద్దమ్మ కొడుకు అని సమాచారం..!!