వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ చేసిన మేకర్స్..!

Divya
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ నిర్మాణ సారధ్యంలో బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా జనవరి 12వ తేదీన చాలా గ్రాండ్ గా సంక్రాంతి పండుగకు రిలీజ్ కాబోతున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈరోజు (జనవరి 6) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించాలని ఒంగోలులో ఏబీఎమ్ గ్రౌండ్స్ లో వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర బృందం రెడీ అయ్యారు. కానీ చివరి నిమిషంలో పేచీ పడి ఆ వేదిక రద్దయింది. ఇప్పుడు తాజాగా మరో వేదికను ఫిక్స్ చేయడం జరిగింది.
ఏబీఎమ్ కాలేజ్ గ్రౌండ్ లో వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  ఈవెంట్ కి అధిక సంఖ్యలో ప్రజలు,  అభిమానులు వచ్చేందుకు అవకాశం ఉంది.  ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందనే కారణం చెబుతూ వేదిక మార్చుకోవాలని తెలిపారు ఏపీ పోలీసులు. చివరి నిమిషంలో వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక విషయంపై మార్పులు చేసినట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఒంగోలులోనే ప్రత్యామ్నాయ స్థానంలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు పలు వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోనే పలు స్థలాలను పరిశీలించి చివరకు అర్జున్ ఇన్ఫ్రా ( బి ఎం ఆర్ మహానాడు గ్రౌండ్) సెలెక్ట్ చేసుకున్నారు.
ఇప్పటికే ఇన్ఫ్రా మేనేజర్ అర్జున్  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అన్ని పనులను కూడా దగ్గరుండి నిర్వహించినట్లు తెలుస్తోంది . ఈరోజు సాయంత్రం అట్టహాసంగా అర్జున్ ఇన్ఫ్రా లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. మాస్ అభిమానుల చేత గోల పెట్టించే సత్తా ఉన్న గోపీచంద్ తో బాలకృష్ణ చేతులు కలిపారు . ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో రంగంలోకి దూసుకుపోతున్నారు.  సంక్రాంతి బరిలో నిలుస్తూ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తలపడనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అన్ని అప్డేట్స్ కూడా భారీ అంచనాలను పెంచేసాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: