అలాంటి పాత్రల కోసం అంత డిమాండ్ చేస్తున్న వరలక్ష్మి..!?

Anilkumar
సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే మొదటగా ఈమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.కానీ హీరోయిన్గా ఈమె పెద్దగా  సక్సెస్ ను అందుకోలేదు. దాని అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సర్కార్ ,పందెంకోడి 2 సినిమాల్లో నటించింది. ఇక అవి కూడా వరలక్ష్మికి పెద్దగా కలిసి రాలేదు. దాని అనంతరం మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించి మంచి గుర్తింపును పొందింది. దాని తర్వాత నాంది సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమాతో కూడా పెద్దగా సక్సెస్ను అందుకోలేదు వరలక్ష్మి. 

ఇక ఆ సినిమాలో ఈమె లాయర్ పాత్రలో నటించింది. దాని అనంతరం ఆ సినిమా తరువాత  ఈమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే గతేడాది చివర్లో సమంతా ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమాలో వరలక్ష్మి ఒక కీలక పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాకి ఈమె పాత్ర చాలా హైలెట్గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని అనంతరం ఇప్పుడు రాబోతున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా ఒక కీలక పాత్రలు నటిస్తోంది ఈమె. అయితే హనుమాన్ శబరి అనే సినిమాల్లో కూడా నటిస్తుంది వరలక్ష్మి.

 శబరి సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ లో నటించబోతుంది వరలక్ష్మి. ఇక ఈ సినిమాలో ఒక తల్లి పాత్రలో కనిపించబోతుంది ఈమె. అయితే ఆ పాత్ర కోసం వరలక్ష్మి ఏకంగా మూడు లక్షల వరకు తీసుకుందట.అయితే ఈ సినిమాకి మొత్తంగా 60 రోజులకు కాల్ షీట్లు ఇచ్చింది వరలక్ష్మి. మొత్తంగా 60 రోజులకు గాను 60 లక్షలకు పైగానే రెమ్యూనిరేషన్ను అందుకుంది వరలక్ష్మి. అంతేకాదు వీర సింహారెడ్డి సినిమాలో కూడా ఈమె పాత్ర కీలకం కావడంతో ఆ సినిమాకి కూడా భారీ రెమ్యూనరేషన్ వరలక్ష్మి తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: