ఆ స్టార్ హీరోయిన్ కోసం గొడవపడ్డ ప్రభాస్-గోపిచంద్..!?

Anilkumar
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాప్ అబుల్ షో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సీజన్ 1 భారీ విజయాన్ని అందుకోవడంతో సీజన్ 2 ని కూడా ఇటీవల ప్రారంభించారు. అయితే సీజన్ వన్ ని మించి సీజన్ 2 ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇటీవల ఈ షో కి ప్రభాస్ రావడం జరిగింది. ఇక ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ ని రెండు పాటలుగా స్ట్రీమింగ్ చేశారు. మొదటి ఎపిసోడ్ రిలీజ్ అయినప్పటికీ రెండవ ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది.అయితే తొలి ఎపిసోడ్లో కేవలం ప్రభాస్ మాత్రమే వచ్చాడు.

 కానీ రెండవ ఎపిసోడ్లో ప్రభాస్ తో పాటు తన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా రావడం జరిగింది. ఇక ఇప్పటికే ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేశారు ఆ హ టీం. ఎపిసోడ్ 2లో వీరి ముగ్గురి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఈ ప్రోమోలో బాలకృష్ణ గోపీచంద్ మరియు ప్రభాస్ ని అడిగిన ఒక ప్రశ్న అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగానే ఆ ప్రశ్నకు సమాధానంగా గోపీచంద్ మరియు ప్రభాస్ ఏం చెబుతారు అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇందులో భాగంగానే బాలయ్య 2008లో మీరిద్దరూ ఒక హీరోయిన్ కోసం గొడవపడ్డారు.. ఆ హీరోయిన్ ఎవరు అంటూ ప్రశ్నించాడు బాలయ్య...

అప్పుడు ప్రభాస్.. నాకు దీంతో ఏం సంబంధం లేదు... గోపిక అంతా తెలుసు అని చెప్తాడు..అప్పుడు గోపీచంద్ 2008లో కాదు సార్ 2004లో గొడవపడ్డాం అనుకుంటా అంటూ చెప్పాడు.. మేమిద్దరం ఆ సమయంలో ఒక హీరోయిన్ కోసం గొడవ పడ్డాం అని చెప్పాడు. అప్పుడు బాలయ్య ఆ హీరోయిన్ ఎవరు అని అడగగా.. త్రిష అంటూ చెప్పవచ్చాడు.. ఇక వారి సమాధానం విన్న అనంతరం బాలయ్యతో పాటు అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ప్రభాస్ త్రిష కోసం మనం ఎప్పుడు కొట్టుకున్నాం రా అంటూ గోపీచంద్ వైపు చూశాడు ...అందుకు గోపీచంద్ వర్షం సినిమాలో మేమిద్దరం త్రిష కోసం కొట్టుకున్నాం అని బాలయ్యతో చెప్తాడు.. వర్షం సినిమాలో హీరోగా ప్రభాస్ నటించినప్పటికీ ఆ సినిమాలో విలన్ గా గోపీచంద్ నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలోని త్రిష కోసం వీరిద్దరూ కొట్టుకున్నారట. ఇక ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చాడు గోపీచంద్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: