మయోసైటీస్ తరువాత మొదటి సారి ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించిన సమంత..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.అయితే గత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఇందుకుగాను గత కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటూ మయోసైటిస్ కి సంబంధించిన చికిత్సను తీసుకుంటుంది. అయితే తాజాగా ఈమె ముఖ్య పాత్రలో నటించిన యశోద సినిమా సూపర్ హిట్ను అందుకుంది. ఇక ఈ సినిమాకి గాను సమంత ఇంట్లోనే ఉండి డబ్బింగ్ కూడా చెప్పింది. త్వరలోనే ఈమె నటించిన షాకుంతలం సినిమాతో మళ్లీ అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉంది. 

ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టింది సమంత. ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అయితే గత కొంతకాలంగా ఎక్కడ కనిపించకుండా ఉన్న సమంత ఎవరు ఊహించిన విధంగా తాజాగా ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది. ఇందులో భాగంగానే సమంత తెల్లటి స్లీవ్ లెస్ షర్ట్ ప్యాంటు ధరించి సన్ గ్లాసులు పెట్టుకుని వెళుతుంది. ఇక దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన చాలామంది సమంత పూర్తిగా మారిపోయింది అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు.

 ఇదిలా ఉంటే ఇక సమంత ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరనక్కెక్కనున్న ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది. ఇందులో భాగంగానే సమంత మేనేజర్.. త్వరలోనే సమంత తిరిగి అన్ని షూటింగ్లలో పాల్గొంటారు. టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ అన్నిటిలోనూ సమంత నటిస్తారు. సమంత అనారోగ్యం కారణంగా ఏ ప్రాజెక్ట్ అని కూడా సమంత క్యాన్సిల్ చేయలేదు. అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎంతో కాలంగా సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సమంత నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: