మెగాస్టార్ సినిమాకి డివోషనల్ టచ్.. వర్కౌట్ అయ్యేనా..?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో 'భోళా శంకర్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో అజిత్ నటించిన వేదాలం అనే సూపర్ హిట్ సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తమిళ రీమిక్ అయినప్పటికీ దీంట్లో రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ లాంటి వ్యవహారాలన్నీ కలిపి సినిమాని తెరకెక్కిస్తున్నాడు మెహర్ రమేష్. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయి. మెహర్ రమేష్ మాస్ ఎలివేషన్స్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేస్తాడనే పేరు ఉంది. పైగా ఎలివేషన్స్ సీన్స్ లో మెగాస్టార్ కూడా అదరగొట్టేస్తారు.

అయితే దీనికి తోడు దర్శకుడు మహా రమేష్ కొత్తగా ఒకటి, రెండు ట్రాకులు అదనంగా యాడ్ చేస్తున్నట్లు తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వార్త వినిపిస్తున్నాయి. తమిళంలో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగులో భారీ హిట్ అవ్వాలంటే సెంటిమెంట్ తో పాటు కనకదుర్గ అమ్మవారి డివోషనల్ టచ్ కూడా ఉండాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ ఐడియా చిరంజీవికి కూడా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అందుకే డివోషనల్ టచ్ తో కూడిన రెండు సన్నివేశాలను యాడ్ చేయమని మెగాస్టార్ చిరంజీవి కోరినట్లు సమాచారం. ఇక మెగాస్టార్ మరియు నిర్మాతల కోరిక మేరకు ప్రస్తుతం ఉన్న సీన్స్ లోనే మెహర్ రమేష్  కొన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా డివోషనల్ కంటెంట్ ఎక్కువగా రాసే కొంతమంది రైటర్స్ తో కూడా కొన్ని డైలాగ్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమాకి డివోషనల్ టచ్ చేస్తున్నారని సమాచారం వినిపిస్తోంది. మరి సిస్టర్ సెంటిమెంట్ తో డివోషనల్ టచ్ అనేది బోలా శంకర్ సినిమాకి వర్కౌట్ అవుతుందా? లేదా అనేది చూడాలి. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తుండగా.. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి జోడిగా తమన్నా కథానాయక నటిస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు దీనికంటే ముందు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: