సన్నీలియోన్ తో.. టాలీవుడ్ హీరో డీప్ చాటింగ్?

praveen
సంతోష్ శోభన్.. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో.  ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం కథలో వైవిద్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతూ ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సంతోష్ శోభన్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుందని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు అని చెప్పాలి. ఏకంగా గోల్కొండ హై స్కూల్ సినిమాతో తన సినీ కెరీర్ను ప్రారంభించి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని వైపుకు తిప్పుకున్నాడు.

 ఆ తర్వాత పేపర్ బాయ్ తో హీరోగా మారిపోయిన సంతోష్ శోభన్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత ఏక్ మినీ కదా, మంచి రోజులు వచ్చాయి, అన్ని మంచి శకునములే, శ్రీదేవి శోభన్ బాబు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. మొన్నటికి మొన్న లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ తో థియేటర్లలో సందడి చేసి ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు  కళ్యాణం కమనీయం అనే సినిమాతో సంక్రాంతి బరిలో కూడా నిలవబోతున్నాడు సంతోష్ శోభన్. యూనికాన్సెప్ట్ బ్యానర్ ఇక ఈ సినిమాను నిర్మించింది అని చెప్పాలి.

 ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రస్తుతం చిత్ర బంధం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. అయితే ఇటీవల కాలంలో అటు బుల్లితెరపై ప్రమోషన్స్ చేయడం కామన్ గా మారిపోయింది. ఈ క్రమంలోని సుమా హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా అనే కార్యక్రమానికి కళ్యాణం కమనీయం అనే చిత్ర బృందం వచ్చింది. ఈ ప్రోమో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే యాంకర్ సుమ సంతోష్ శోభన్ ఫోన్ లాక్కొని అతని వాట్సప్ ఓపెన్ చేయగా.. ఆ వాట్సాప్ లో హీరోయిన్ అనుపమతో ఏకంగా హాట్ బ్యూటీ సన్నిలియోన్ తో కూడా డీప్ గా చాటింగ్ చేస్తున్న స్క్రీన్ షాట్లు చూపించింది. ఇక ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: