విఘ్నేష్ #AK62 మూవీ నుంచి తప్పకుండా త్రిష.. ఆమె స్థానంలో..?

Divya
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఎడాది వాలిమై సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో తునివు పేరిట సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. జనవరి 11వ తేదీన సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తమిళనాడులో విజయ్ దళపతి వారిసు సినిమాతో పోటీ పడుతున్న నేపథ్యంలో అజిత్ సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించాయి. దీంతో విజయ్ సినిమాను వారం రోజులు లేటుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా ఉండగా అజిత్ ఒక సినిమాను విడుదలకు ఉంచి మరొక సినిమాను సెట్ పై ఉంచాడు.  ఈ క్రమంలోనే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో తన 62వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో అజిత్ కు హీరోయిన్ గా పొన్నియన్ సెల్వన్ -1 మూవీ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న త్రిష ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కానీ ఇప్పుడు ఆమె మరొకవైపు నాలుగు సినిమాలలో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  నిజానికి విగ్నేష్ శివన్ తన భార్య నయనతారను ఈ సినిమాలో భాగం చేయాలని అనుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు కానీ త్రిషను ఫిక్స్ చేశారు.

ఇప్పుడు త్రిష కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల అజిత్ సినిమాలో నటించలేకపోతున్నాను అని స్పష్టం చేసినట్లు సమాచారం. మరొక వైపు కమలహాసన్ తో కూడా సినిమా చేస్తోంది. ఈ క్రమం లోనే సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. మరి త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్ ను తీసుకునే అవకాశం ఉంది.  కాజల్ అగర్వాల్ ఇప్పటికే తమిళంలో కమలహాసన్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇక అజిత్ 62వ సినిమాలో కూడా ఈమెను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: