టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 19 సంవత్సరాలు దాటినప్పటికీ అదే అందంతో కొనసాగుతుంది తమన్నా. అయితే తమన్నా పదవ తరగతి చదువుకునే సమయంలో తెలుగులో ఒక సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది తమన్నా.అంతేకాకుండా ఆ సినిమాతో పాటు కొన్ని యాడ్లలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అలా చిన్నగా తన కెరియర్ను మొదలుపెట్టిన తమన్నా ప్రస్తుతం ఒక్కో సినిమాకి నాలుగు నుండి ఐదు కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటుంది.
అయితే ముఖ్యంగా ఒక సినిమాలో ఏదో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తే కనుక ఏకంగా కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది తమన్నా. అయితే మొట్టమొదటిసారి తమన్నా ఒక్క ఈ యాడ్ కి గాను లక్ష రూపాయలు తీసుకుందట.ఇక పదో తరగతిలోనే నటించే అవకాశం రావడంతో నో చెప్పలేదు తమన్న. ఇక పదో తరగతి చదువుకునే సమయంలోనే ఒక్కో యాడికి తమన్నా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ని తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే తమన్నకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తనకు మొదటగా వచ్చిన రెమ్యూనరేషన్తో తమన్నా షాపింగ్ చేసి
ఆ డబ్బునంత ఖర్చు చేసిందట. ఇక యాడ్ లలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న అనంతరం శ్రీ సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న తమన్న దాని అనంతరం హ్యాపీడేస్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.వరుస సినిమాలలో నటిస్తూ మంచి మంచి సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ వస్తోంది. ఇక అలా ప్రస్తుతం స్టార్ హీరోల సరసన కూడా నటిస్తోంది తమన్నా. స్టార్ హీరో లేక కాకుండా సీనియర్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని అందుకుంది తమన్న..!!