టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇలియానా ఇప్పుడు మాత్రం స్లో అయింది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ నుండి కూడా ఈమెకి వరుస అవకాశాలు రావడం జరిగింది. దీంతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఇలియానా. ఇక అక్కడ సినిమాలు చేస్తున్న సమయంలో తమిళ సినిమాలలో కూడా ఈమెకి ఆఫర్ రావడం జరిగింది. ఇలా వరుస ఆఫర్లు రావడంతో సినిమాలు చేయను అంటూ చెప్పేసింది. ఆ దెబ్బతో ఈమెకి సినిమా అవకాశాలు రాకుండా పోయాయి.
ఇక ఈమె బాలీవుడ్లో నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో మళ్లీ టాలీవుడ్ సినిమాల వైపు ఆశగా చూస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. అయినప్పటికీ టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇలియానాకి అవకాశాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రష్యన్ ఫోటోగ్రాఫర్ తో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్న ఇలియానా ఆయనతో దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అప్పట్లో ఈ ఫోటోలు కాస్త తెగ వైరల్ అయ్యాయి. ఇక కొన్నాళ్ల క్రితం అతనితో కూడా దూరమయ్యింది ఇలియానా. అయితే తాజాగా తన సోలో ఫోటోలతో మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే హీరోయిన్ గా కాదు కదా కనీసం స్పెషల్ ఐటమ్ సాంగ్స్ లో కూడా ఇలియానాకి ఆఫర్లు రావడం లేదట. ఇక అలాంటి ఛాన్సులు కూడా ఇచ్చేందుకు రెడీగా లేరట దర్శక నిర్మాతలు. దీనికి కారణం ఇలియానా క్రేజ్ తగ్గింది కాబట్టి స్పెషల్ సాంగ్ లలో నటించినప్పటికీ పెద్దగా ఆదరణను పొందవు కాబట్టి ఇలియానాకి ఛాన్సులు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. దీంతో చాలామంది ఇలియానా అభిమానులు కనీసం ఐటమ్ సాంగ్ అయినా ఇలియానా అని చూడాలి అని అంటున్నారు. చాలామంది ఇలియానా అభిమానులు ఇలియానా మళ్లీ సినిమాలు చేస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్లను సైతం చేస్తున్నారు. ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి ఇలియానా సిద్ధంగా ఉన్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం ఈమెకి అవకాశం ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇటీవల తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన ఇలియానా ఐటమ్ సాంగ్ నటిస్తానని చెప్పింది. ప్రస్తుతం సినిమాలలో నటించక పోయినప్పటికీ తనకు సంబంధించిన బికినీ ఫోటోల తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది..!!