వార్నర్ తెలుగు సినిమాల్లో నటిస్తావా.. నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్?
లాక్ డౌన్ సమయంలో ఏకంగా తన ఎంటర్టైనింగ్ వీడియోలతో ప్రేక్షకులందరినీ అలరించాడు డేవిడ్ వార్నర్. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో రిల్స్ తో అభిమానులను ఆకట్టుకోవడంలో ముందు ఉంటాడు అని చెప్పాలి. ఇక తెలుగు హీరోలకు సంబంధించిన ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందులోని ఫేమస్ పాటపై డ్యాన్సులు చేయడం వార్నర్ కు బాగా అలవాటు. ఇక అలాంటి సోషల్ మీడియా సూపర్ స్టార్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ప్రముఖ ఓటీపీ ఫ్లాట్ ఫామ్ అయినా నెట్ ఫ్లిక్స్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.
క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత సినిమాల్లో నటించాలని మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించాలి అంటూ నెట్ ఫ్లిక్స్ వార్నర్ ని కోరింది అని చెప్పాలి. ఇక డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలలో నటించడానికి సరైన వేదిక ఇచ్చేది మేమే అని భావిస్తున్నాము అంటూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం. అయితే దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏకంగా నవ్వుతున్న ఏమోజీలను పోస్ట్ చేశాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ట్విట్టర్ పోస్టులు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. వార్నర్ నిజంగా తెలుగు సినిమాల్లో నటిస్తే మాకు అంతకంటే ఇంకేం కావాలని తెలుగు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.