ఆఇద్దరి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్న విజయ్ దేవరకొండ !

Seetha Sailaja
‘లైగర్’ మూవీ సూపర్ ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ అటు ప్రేక్షకులలో కాని అదేవిధంగా దర్శక నిర్మాతలలో కానీ ఏమాత్రం తగ్గలేదు. దీనితో అతడితో వరసపెట్టి సినిమాలు తీయడానికి భారీ నిర్మాణసంస్థలు పోటీ పడుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో విజయ్ తో సినిమా తీయాలని ప్రయత్నిస్తున్న దిల్ రాజ్ ఇప్పటికే అతడికి భారీ అడ్వాన్స్ ఇవ్వడమే కాకుండా విజయ్ దగ్గరకు అనేకమంది దర్శకులను పంపుతూ వారు చెప్పే కథలను వినమని కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
 
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ సమంత అనారోగ్యంతో షూటింగ్ ఆగిపోవడంతో ఆమూవీ షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో ప్రస్తుతానికి విజయ్ కు కూడ క్లారిటీ లేదు అంటున్నారు. దీనితో ఆసినిమా పూర్తిచేయడం గురించి వేచి చూడకుండా మరొక సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలి అన్న స్థిరనిర్ణయానికి విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో విజయ్ పై ఒక సెంటిమెంట్ చాల ఎక్కువగా పనిచేస్తోంది అని లీకులు వస్తున్నాయి.
 
 
విజయ్ దేవరకొండ కెరియర్ లో బ్లాక్ బష్టర్ హిట్ గా నిలిచిన ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశు రామ్ పై విజయ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే పరుశు రామ్ కొన్ని నెలలక్రితం విజయ్ ని కలిసి ఒక టోటల్ ఎంటర్ టైన్మెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ కథను వినిపించినట్లు టాక్. ఈకథ విజయ్ కి కూడ బాగా నచ్చింది అంటున్నారు. అయితే ఈమధ్య విజయ్ ను కన్నడ దర్శకుడు నర్తన్ ను కలిసి ఒకకథ వినిపించినట్లు తెలుస్తోంది.
 
 
ఈమధ్యకాలంలో కన్నడ దర్శకులు తీస్తున్న సినిమాలు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతూ ఉండటంతో ఆదర్శకుడుని కూడ విజయ్ హోల్డ్ లో పెట్టినట్లు టాక్. నర్తన్ విజయ్ కు చెప్పిన కథ పాన్ ఇండియా మూవీ కథ అని అంటున్నారు. ‘లైగర్’ ఫెయిల్ అయిన తరువాత విజయ్ కు మళ్ళీ పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసే అవకాశం రాలేదు. దీనితో సెంటిమెంట్ ను నమ్ముకుని తన తదుపరి సినిమాకు పరుశు రామ్ కు అవకాశం ఇవ్వాలా లేదంటే ఒక కన్నడ దర్శకుడుని నమ్ముకోవాలా అన్న కన్ఫ్యూజన్ లో ప్రస్తుతం ఈ రౌడీ స్టార్ సతమతమవుతున్నట్లు టాక్..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: