టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ కలిసి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ ఇద్దరు వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇందులో భాగంగానే రవితేజ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
రవితేజ మాట్లాడుతూ.. నేను చెప్పాలి అనుకున్నది బాబి చెప్పేసాడు.. చిరంజీవి అన్నయ్య ఎవరిని ఏమీ అనరు.. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే కూడా దాన్ని భరిస్తారు.. ఎవరన్నా ఏమైనా అంటే లోలోపల బాధపడతారేమోగానీ ..అసలు బయటకి చూపించరు.. అదే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం.. పోనీలే పాపం అంటూ అందరి పై జాలి చూపిస్తాడు.. ఇన్నాళ్లుగా ఆయనతో కలిసి ఉంటున్నాను.. కానీ ఎప్పుడూ కూడా ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడలేదు.. అంత మంచి వ్యక్తి చిరంజీవి.. ఐ లవ్ యు అన్నయ్య అంటూ చిరంజీవి గురించి ప్రశంసించాడు రవితేజ.
దాని అనంతరం దర్శకుడు బాబి గురించి రవితేజ మాట్లాడుతూ.. బాబీ నాకు బలుపు సినిమా సమయం అప్పటినుండి తెలుసు.. దాని తర్వాత పవర్ సినిమా చేశాడు.. ఇక ఆ సినిమా తర్వాత బాబి కెరియర్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.. ఇక ఇప్పుడు ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అవ్వడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టును కొడతాము అంటూ ఎంతో నమ్మకంతో ఉన్నాడు రవితేజ. ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జనవరి 13న ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది...!!