తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు "అ" అనే మూవీతో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ తో ప్రశాంత్ వర్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ఈ దర్శకుడు కల్కి ... జాంబిరెడ్డి అనే మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లలో జాంబిరెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. జాంబిరెడ్డి మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన జాంబీ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హనుమాన్ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ టీజర్ అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులలో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హనుమన్ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ని మే 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.