ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న భారీ చిత్రాలలో 'వారసుడు'
సినిమా ఒకటి.
జనవరి 11న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొన్ని రోజులుగా ఈ
సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వినిపించాయి. దాని ప్రకారం ఈ
సినిమా నిజంగానే వాయిదా పడింది.
టాలీవుడ్ అగ్ర
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే నిజానికి రేపటితో ఈ
సినిమా పనులన్నీ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కానీ మెగా, నందమూరి ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే
నిర్మాత దిల్ రాజు ఈ
సినిమా విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం.
అయితే ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి
సినిమా ట్రైలర్లకు
ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు
సినిమా ట్రైలర్లు ప్రస్తుతం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమాని ముందు థియేటర్స్ లో చూడాలని
ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అటు అదే సమయంలో
నిర్మాత దిల్ రాజు పై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఈ క్రమంలో
నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమాని ముందు రిలీజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో చిరంజీవి, బాలకృష్ణతో సినిమాలు చేసే ఛాన్స్ లేదు. ఈ రీజన్ వల్లే దిల్ రాజు వారసుడు
సినిమా విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం.
అయితే కేవలం తెలుగులో మాత్రమే ఈ
సినిమా వాయిదా పడింది. తమిళంలో మాత్రం ఈ
సినిమా జనవరి 11న విడుదల కానుంది.తెలుగులో
జనవరి 14వ తేదీన కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అంతేకాదు వారసుడు సినిమాని చిరంజీవి,
బాలకృష్ణ సినిమాల కంటే తక్కువ థియేటర్స్ లోనే విడుదల చేస్తున్నట్లు దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తనపై ఉన్న నెగెటివిటీ వారసుడు
సినిమా రిజల్ట్ పై పడకూడదని దిల్ రాజు సినిమాని కాస్త ఆలస్యంగా విడుదల చేస్తూ ఫ్యాన్స్ ని కాస్త కూల్ చేశారు. ఇక ముందు తమిళంలో వారిసు సినిమాకు వచ్చే టాక్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమాకు కేటాయించ