రామ్ చరణ్ సినిమాతో శంకర్ అలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడా..?

Anilkumar
దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటుడు శ్రీకాంత్, అంజలి, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. 

అందులో ఒక పాత్రలో సీఎం గాను మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రి, హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం సింహాచలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి పలు అప్డేట్స్ ఇప్పటికే నెట్టింట హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. శంకర్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. తన ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఉంటుంది. అయితే కంప్లీట్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాతో కూడా దర్శకుడు శంకర్ ఓ సాలిడ్ మెసేజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నారట. మనం ఓటును అమ్ముకుంటే మన పిల్లల బంగారు భవిష్యత్ ని అమ్ముకున్నట్లే అనే సందేశాన్ని ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మెసేజ్ ను సినిమాలో హైలెట్ చేయబోతున్నారట. అంతేకాదు 2024 లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి తరహా సినిమా రాబోతుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన ముఖ్యమంత్రిగా కనిపిస్తారని సమాచారం. ఆయనతోపాటు సీనియర్ నటి ఖుష్బూ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసినిమాని వేసవి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి చిత్రాన్ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: