వీరసింహారెడ్డి ఇంటర్వెల్ లీకులతో జోష్ లో బాలయ్య అభిమానులు !
బాలకృష్ణ చిరంజీవి ల సంక్రాంతి రేస్ తారా స్థాయికి చేరడంతో వారి వీరాభిమానులు ఈమూవీల పై తమతమ అంచనాలు విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇలాంటి అంచనాల మధ్య ‘వీరసింహారెడ్డి’ మూవీకి సంబంధించి ఇంటర్వెల్ సీన్ ఇప్పుడు లీక్ అయింది.
మరికొన్ని నిముషాలలో ఈ మూవీ ఇంటర్వెల్ కు రాబోతోంది అనగా బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటిస్తున్న వరలక్ష్మీ బాలకృష్ణను నమ్మించి ఆమె ఇంటికి పిలిపించుకుని చంపే సీన్ ఈ మూవీకి హైలెట్ గా మారుతుందని అంటున్నారు. ఆసీన్ లో అద్భుతమైన భావోద్వేగాలను బాలయ్య చూపెడితే శ్రీలక్ష్మి తన విలనిజమ్ లో మరొక మెట్టు ఎక్కడం ఖాయం అంటూ ఈ సీన్స్ చూసిన ఇప్పటికే కొంతమంది లీకులు ఇస్తున్నారు.
ఇది ఇలా ఉంటే 12వ తారీఖు సోలో రిలీజ్ గా విడుదల కాబోతున్న ‘వీరసింహా రెడ్డి’ కి తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లు దొరకడంతో ఆమూవీ ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈమూవీ కథలో అనేక ట్విస్ట్ లు ఉన్నాయి అని చెపుతున్న గోపీచంద్ మలినేని మాటలను బట్టి ఈమూవీకి మొదటిరోజు మార్నింగ్ షో నుండి పాజిటివ్ టాక్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు.
పరిస్థితులు ఇలా ఉంటే ఓవర్సీస్ లో ఇప్పటికే ఓపెన్ అయిన ఈమూవీ టిక్కెట్లకు భారీ స్పందన వస్తూ ఉండటంతో పాటు బాలయ్య ఓవర్సీస్ అభిమానులు ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలలో హడావిడి చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు కూడ అదే జరిగితే ‘వీరసింహారెడ్డి’ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడం ఖాయం అన్న అంచనాలలో బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘అన్ ష్టాపబుల్’ షోతో ఇప్పటికే బాలయ్య క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఈసినిమా కూడ హిట్ అయితే ఇక బాలయ్య స్పీడ్ అన్ ష్టాపబుల్..