ఎన్టీఆర్ ధరించిన బ్లాక్ హుడీ.. మరీ అంత కాస్లినా?

praveen
సాధారణంగా అభిమానులు అందరూ స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తి చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సినిమా అప్డేట్స్ మాత్రమే కాదు ఇక పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు ఏవైనా తెలుస్తాయేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు ధరించే దుస్తులు, వాచ్లు, ఇక వాళ్ళు వాడే కార్లు ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఇక వాటి ఖరీదు గురించి తెలిసి అందరూ అవాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఒక బ్లాక్ హుడి ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే బ్రాండెడ్ ఉత్పత్తులతో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోవడం ఇదేమి కొత్త కాదు.  ఎన్టీఆర్ వాడే కార్లు, షూస్ ఇక, వాచ్లు ఇలా అన్ని కూడా భలే కాస్లిగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ఒకవైపు ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు త్రిబుల్ ఆర్ ను గట్టిగా ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.



 ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్లాక్ హుడి ధరించి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. రాల్ఫ్ లారాన్ అనే హుడి ఎన్టీఆర్ ధరించడం గమనార్హం. అయితే ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఎన్టీఆర్ ధరించిన హుడి ధర ఎంత ఉంటుంది అని సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక ఎన్టీఆర్ ధరించిన హుడి ధర తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారని చెప్పాలి. ఎంతో సింపుల్ గా ఉన్న బ్లాక్ హుడి ధర 65,407 రూపాయలట. చూడ్డానికి అంత సింపుల్ గా ఉంది ధర మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది అని ఇది చూశాక అభిమానులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: