రామ్ చరణ్ చేతుల మీదుగా అహింస ట్రైలర్ లాంచ్..!
ప్రమోషన్స్ లో భాగంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయగా.. ఇప్పుడు ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచే విధంగా రామ్ చరణ్ ని రంగంలోకి దించారు. అహింస ట్రైలర్ ని రామ్ చరణ్ జనవరి 12న అంటే ఈరోజు ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ రూపంలో షేర్ చేసింది. మరి ఈ ట్రైలర్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుంది అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే అభిరామ్ పైన శ్రీ రెడ్డి లాంటి వారు రకరకాలుగా సంచలనం కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి అపవాదాలను నెట్టుకొని వచ్చి అభిరామ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. నిజానికి కొత్త వాళ్లతో సినిమా చేసిన సమయంలో దర్శకుడు తేజ చాలా గొప్పగా ఆలోచించి వారిలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తేజాతో పని చేసిన ప్రతి ఒక్క హీరో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా తనకు కావాల్సిన ఎమోషన్ ని ఆర్టిస్టు నుంచి తీసుకోవడంలో తేజ దిట్ట కాబట్టి అతను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఈ క్రమంలోని అభిరామ్ ను కూడా తేజ అలాగే తీర్చిదిద్ది ఉంటాడు అని సమాచారం.