మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా ప్రస్తుతం సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొంది ఎందరికో ఆదర్శంగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా అంటే రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు పాటలు విడుదల చేశారు చిత్ర బృందం.
ఇక ట్రైలర్ తో భారీ అంచనాలను పెంచేసింది ఈ సినిమా.ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఒక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిరు.ఆయన మాట్లాడుతూ... సినిమా షూటింగ్ లో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి.. అంతేకాదు సినిమా దర్శకుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.. సినిమా బాగా వస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకోవాలి.. చిత్రీకరించింది అంతా కూడా సినిమాకి ఉపయోగకరంగా ఉండేటట్లు చూసుకోవాలి అంటూ చెప్పవచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే విలేకరి బాస్ పార్టీ పాట కోసం అడగడం జరిగింది..
ఇక దీనికి గాను మెగాస్టార్ చిరంజీవి... అద్భుతమైన ఇంకా ఖరీదైన సెట్టను వారు పూర్తిగా ఉపయోగించుకోలేదని దాన్ని మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా భావించానని స్పష్టం చేశాడు మెగాస్టార్ చిరంజీవి.. 360 డిగ్రీల సెట్ ను కవర్ చేసేలా వైడ్ షాట్లలో సెట్ లోని షాట్లను తీయాల్సి ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చాడు.. అయితే ఈ సినిమాలో ఈ సెట్ ని కేవలం ఆ ఒక్క పాట కోసమే నిర్మించమని చెప్పుకొచ్చాడు.. దీంతో ఈ పాట కోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేశారని తెలుస్తోంది.. ఇకపోతే ఈ పాట అద్భుతంగా ఉన్న సెట్ కోసం నిర్మాతలను చిరంజీవి బహిరంగంగా అభినందించారు అని తెలుస్తోంది.. అంతేకాదు ఈ పాట సెట్ కోసం భారీ డబ్బును కూడా నిర్మాత లు ఖర్చు చేసినట్లుగా చెప్పారు..!!