ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం రౌడీ హీరోగా కొనసాగుతున్నాడు
విజయ్ దేవరకొండ. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ని ప్రారంభించిన ఈ
హీరో పాన్
ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందడం అంటే మామూలు విషయం కాదు. ఈ స్థాయికి రావడానికి
విజయ్ దేవరకొండ ఎన్నో కష్టాలను పడ్డాడు. ఇక అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో
అర్జున్ రెడ్డి అనే సినిమాతో స్టార్
హీరో అయ్యాడు.
విజయ్ దేవరకొండ సందీప్
రెడ్డి వంగా దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాతో
విజయ్ దేవరకొండ కి ఎవరు ఊహించిన విధంగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో
అర్జున్ పాత్రకి
విజయ్ దేవరకొండ తప్ప మరొక
హీరో అయితే సెట్ అయ్యేవాడు కాదు
అన్న విధంగా ఆ పాత్రలో లీనమై నటించాడు విజయ్. ఈ
సినిమా అనంతరం గీతాగోవిందం
సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ
సినిమా వందల కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో
విజయ్ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా వరుస హిట్ సినిమాలతో దోసుకుపోతున్న సమయంలో నోట సినిమాలో నటించి తప్పు చేశాడు ఆ
సినిమా డిజాస్టర్ గా మిగిలింది. రెండు సినిమాల విజయాల అనంతరం ఒక
సినిమా ఫ్లాప్ అయితే ఏం కాదు అని భావించిన సమయంలో
టాక్సీవాలా సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
విజయ్ విజయ్ కి ఉన్న క్రేజ్ వల్లే ఈ
సినిమా ఎవరు ఊహించని విధంగా హిట్ అయింది.
దాని అనంతరం ఆయన నటించిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే ఈ క్రమంలోనే పాన్
ఇండియా రేంజ్ లో లైగర్ సినిమాతో మళ్లీ ఏంట్రా ఇచ్చాడు
విజయ్ .ఇక ఈ
సినిమా గురించి మిశ్రమ స్పందన దక్కినప్పటికీ అంతగా ఎవరిని ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో ఈ
సినిమా గురించి భారీ బజ్ ను క్రియేట్ చేయడం వల్లే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. అయితే ప్రస్తుతం
విజయ్ లైగర్
సినిమా తర్వాత
ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. శివానిర్వాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
విజయ్ కి జోడిగా
సమంత నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే
సమంత అనారోగ్యం కారణంగా ఈ
సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో అయోమయంలో పడ్డాడు విజయ్. ఈ
సినిమా పూర్తి అయితే తప్ప మరో
సినిమా చేయడానికి అవకాశం లేదు. ఆ మధ్య
సుకుమార్ తో విజయ ఒక
సినిమా చేయనన్నాడు అన్న వార్తలు వచ్చాయి. కానీ ఈ
సినిమా షూటింగ్ పూర్తి అయితే తప్ప
విజయ్ మరో
సినిమా చేసే అవకాశం లేదు. దీంతో ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో పడ్డాడు
విజయ్ దేవరకొండ..!!