మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా 13న విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అద్భుతంగా నిర్వహించారు చిత్ర బృందం. ప్రస్తుతం చిరంజీవి ఒకవైపు ప్రమోషన్లు మరోవైపు ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నాడు.
అయితే ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఇన్ డైరెక్ట్ గా బాలయ్య గురించి కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది.ఇక ఈ నేపథ్యంలో చిరంజీవి మాట్లాడుతూ రాంచరణ్ ఎక్కడికి వెళ్లినా కూడా మా నాన్న చిరంజీవి ఆయన చాలా గొప్పవాడు ఆయన నిర్మించిన గొప్ప వారు లేరు అంటూ ప్రతిసారి నా గురించి చెప్తాడు. ప్రతిసారి అలా మాట్లాడడం వల్ల చాలామందికి చిరాకు వస్తుంది. అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్.అయితే దీన్ని బట్టి చూస్తే గతంలో బాలకృష్ణ ఎక్కడికి వెళ్లినా సరే ముందుగా తన నాన్న గారి గురించి ప్రస్తావిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.
మాకంటే గొప్పవారు ఎవరూ లేరు అని బాలయ్య చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీ పరోక్షంగా బాలయ్య గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మెగాస్టార్ చిరంజీ మాటలు విన్న నందమూరి అభిమానులు ఆ మాటలని చిరంజీవిపై తిప్పి కొడుతున్నారు. దీంతో బాలయ్య పై చిరంజీవి పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి నందమూరి బాలకృష్ణ స్పందిస్తారా లేదా అన్నది చూడాలి..!!