మెగా ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. దీంతో ఎంతో ఆనందంతో ఉన్నారు చిత్ర బృందం. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డులో భాగంగా త్రిబుల్ ఆర్ సినిమాలో హీరోలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ పాల్గొన్నారు .ఇక ఈ వేడుకలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్చరణ్ లో ఈ సినిమా మేకింగ్ సమయంలో రాజమౌళి తమను ఎంత ఇబ్బంది పెట్టారో చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు ఇద్దరు హీరోలు. 

కాలిఫోర్నియాలో  జరిగిన ఈ అవార్డు ప్రధాన ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకి గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఇక ఈ వేడుకకి గాను జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కీరవాణి రాజమౌళి మరియు తమ తమ సతీమణులు రావడం జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే వెరైటీ మ్యాగజిన్ కు చెందిన మార్క్ మార్కెట్ తో ముచ్చటించాడు  రామ్ చరన్. ఇందులో భాగంగానే ఆయన మార్వెల్ స్టూడియోస్ నుండి కాల్ వస్తే మీరేం చేస్తారు అంటూ రాంచరణ్ అడగడం జరిగింది..

దీనికిగాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. తప్పకుండా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.. దాంతో పాటు ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులకు సైన్ చేశానని.. 2023లో 3 2024లో మూడు ప్రాజెక్టులకు ఓకే చేశాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేస్తున్నాడు రామ్ చరణ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇటీవల చేయడం జరిగింది. ఈ సినిమాలతో కలిపి రామ్ చరణ్ ఆరు సినిమాల చేస్తున్నట్టు చెప్పాడా లేదా ఈ సినిమాలో కాకుండా మరో ఆరు ప్రాజెక్టులు రాంచరణ్ చేస్తున్నాడా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: