లుక్ మార్చేసిన నాని.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని దసరా సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా గోదావరిఖని సింగరేణి బ్యాక్గ్రౌండ్ రానుంది.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని సరసన హీరోయిన్గా నటిస్తోంది.మార్చి 30 న ఈ సినిమా  విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ఒక్కసారిగా తన లుక్ ని మొత్తంగా మార్చేశాడు నాని.

 నిన్న మొన్నటి వరకు దసరా సినిమా కోసం గడ్డం జుట్టు విపరీతంగా పెంచేసాడు నాని. తాజాగా ఎవరు ఊహించిన విధంగా 20 ఏళ్ల కుర్రాడు లాగా మారిపోయాడు నాని. మీసం గడ్డం తీసేసి కొత్త లుక్ లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ఫోటోని చూసిన వారందరూ అష్ట చమ్మ రోజులలో నాని గా ఉన్నారు అంటూ కామెంట్లను సైతం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాని క్లీన్ షేవ్ చేసుకున్న ఈ ఫోటో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కొత్త లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంటూ నా నీ అభిమానులు కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇక ఇటీవల నాని తన 30వ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో

చేయనున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో మృణాళ్ ఠాగూర్ నాని సరసన హీరోయిన్గా నటిస్తోంది. నాని ఒక పాపకు తండ్రిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని ఇటీవల న్యూ ఇయర్ కానుకగా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాలో తండ్రి కూతుర్ల బాండింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో భాగంగానే కూతురు నీకు గడ్డం బాలేదు నాన్న అని చెప్తే మన సినిమాకి గడ్డం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. నాని చెప్పినట్లుగానే దసరా షూటింగ్ పూర్తయిన వెంటనే క్లీన్ షేర్ చేసుకున్నాడు నాని. దీంతో ఈ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: