కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. సీరియస్ అయిన రష్మీక..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రష్మిక మందన. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్లో కూడా నటిస్తోంది ఈమెమ్అయితే గత కొంతకాలంగా రష్మిక ఏం మాట్లాడుతున్న అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల కన్నడ సూపర్ హిట్ కాంతార సినిమా రిలీజ్ సమయంలో ఈమె చేసిన కామెంట్లు ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రష్మిక మందన చేసిన కామెంట్లతో ఆమెని నెటిజన్లు బాగానే ఆడుకున్నారు. తాజాగా సౌత్ సినిమాలలో రొమాంటిక్ సాంగ్స్ గురించి కూడా కొన్ని సంచలన కామెంట్లను చేసింది రష్మిక మందన . 


అవి కూడా నెగిటివ్ గానే ప్రచారమయ్యాయి. అయితే ఇప్పుడు తను మాట్లాడిన మాటలకి గాను బాధపడుతోంది రష్మిక మందన . అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుగా చూపిస్తున్నాయి అంటూ పేర్కొంది రష్మిక . ఈ క్రమంలోనే తను చేసిన కామెంట్లను వివరిస్తూ బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ బాగుంటాయి అని చెప్పే సమయంలో సౌత్ సినిమాలలో ఐటెం సాంగ్స్ మాస్ పాటలు తప్ప రొమాంటిక్ సాంగ్స్ ఉండనట్లుగా మాట్లాడింది రష్మిక.. అయితే రష్మిక మందన  చేసిన ఈ కామెంట్లకి గాను తమిళ కన్నడ మలయాళం సినిమా ఫ్రెండ్స్ నేరుగా ఈ ట్రోలింగ్స్ 


పై స్పందించింది.. రష్మిక మందన ఇందులో భాగంగానే మాట్లాడుతూ.. నేను చెప్పేది ఎవరు వినడం లేదని.. నేను చెప్పిన మాటలు కట్ చేసి అవి వైరల్ చేస్తున్నారు అని..దీంతో తన అభిప్రాయం తప్పుగా బయట ప్రచారం అవుతుంది అని.. చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం రష్మిక మందన పాన్ ఇండియా హీరోల సరసన నటిస్తోంది. అందుకే చాలామంది దీన్ని ఓర్వలేని వారు ఇలాంటి నేటివిటీని స్ప్రెడ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని వాపోయింది రష్మిక మందన..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: