యంగ్
హీరోయిన్ మాళవిక మోహన్ తెలుగు చిత్రాలలో నటించకపోయినప్పటికీ
ఆడియన్స్ లో మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా
తమిళ చిత్రాలలో
మాస్టర్ ,పేట, మారన్ వంటి తెలుగు లో పలు చిత్రాలు విడుదలై మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలు సత్తా చాటుతూ ఉండడంతో తెలుగు మార్కెట్ కూడా బాగా పెరిగిపోతోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ
టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది .ఇప్పటికే పలువురు హీరోయిన్లు తెలుగులో హిట్ చిత్రాలను అందుకున్నది.
ఈ క్రమంలోనే
మాళవిక మోహన్ తెలుగు
ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పాన్
ఇండియా ప్రభాస్
డైరెక్టర్ మారుతి కలయికలో రాబోతున్న చిత్రంలో
మాళవిక హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే
మాళవిక గ్రాండ్ ఎంట్రీ తప్పదంటూ చెప్పవచ్చు. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ
విజయ్ దేవరకొండ సరసన నటించాల్సి ఉన్నది కానీ కొన్ని కారణాల చేత ఆ
సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక
సంక్రాంతి పండుగ సందర్భంగా
మాళవిక మోహన్ ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతోంది. ముఖ్యంగా ఆకుపచ్చని లెహంగాలో ఎల్లో చీరలు మ్యాచింగ్ బ్లౌజులు తన అందంతో కట్టిపడేస్తోంది.
తాజాగా
మాళవిక షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కుర్రకారులను సైతం
ఫిదా చేసేలా కనిపిస్తూ ఉన్నాయి. తన అందమైన నవ్వుతూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టేలా చేస్తోంది మాళవిక.ఈ
పండుగ వేళ నిండైన దుస్తులను కనువిందు చేయడంతో అభిమానులు సైతం చాలా
ఖుషి అవుతున్నారు. ఎప్పుడూ కూడా ఈ ముద్దుగుమ్మ అందాన్ని చూపించడం విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాళవికాకు
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం
మాళవిక మోహన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.