సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో అడుగుపెట్టి స్టార్ హీరోలు అయిన వారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కొందరు తమ టాలెంట్ తో స్టార్ హీరో హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటారు.ఇక అలాంటి వారిలో శృతిహాసన్ కూడా ఒకరు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది బడా హీరోల సరసన మరియు సీనియర్ హీరోల సరసన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. దాంతోపాటు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్యకి జోడిగా నటించింది.
ఇక ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. దీంతో ఒకేసారి రెండు భారీ సక్సెస్ లను అందుకుంది.ఈమె నటించిన రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలై మంచి విజయాన్ని దక్కించుకోవడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మరో పక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాలో కూడా ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మెగా అభిమానులు శృతిహాసన్‌ని తెగ పొగిడేస్తున్నారు. శృతిహాసన్‌ది గోల్డెన్ హ్యాండ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాదు శృతిహాసన్ మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్గా మారిపోయింది అంటూ చాలామంది మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈమె మెగా హీరోల సినిమాలలో వారి సరసన హీరోయిన్గా నటించింది. ఇక అలా మెగా హీరోలతో ఈమె చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మెగా హీరోలకు శృతిహాసన్ లక్కీ హీరోయిన్గా మారిపోయింది అన్న కామెంట్లను సైతం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని అనంతరం రామ్ చరణ్ తో కలిసి ఈవిడ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాని అనంతరం అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలో కూడా ఈమె నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు మెగాస్టార్ సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించింది శృతిహాసన్. దీంతో ఈమె హీరోయిన్గా నటించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి..!!