సౌందర్య గురించి ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
కన్నడ అందాల తార సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈమె కన్నడ అయినప్పటికీ తెలగింటి ఆడబిడ్డలా ఎప్పుడూ చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. చివరికి విమాన ప్రమాదంలో కన్నుమూసి ఒక్కసారిగా ఇండస్ట్రీని శోకసంద్రం లోకి తోసేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే సౌందర్యకి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన హావ భావాలతో ఎందరినో మెప్పించింది.  తెలుగింటి ఆడపడుచులా పద్ధతిగా ఉండే ఈమె కొంతమేరకు నెగిటివ్ రోల్స్ లో కూడా నటించడం జరిగింది. 

కమీడియన్ సరసన  కూడా డాన్స్ చేసి తను గ్రౌండ్ టు ఎర్త్ నేచర్ అని చూపించుకుంది.ఎంతో కష్టపడి స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది.ఇందుకు గాను సౌందర్యని సినీ సెలబ్రిటీలు సైతం ఇష్టపడేవారు. అంతేకాదు తను చేసే సినిమాకి సంబంధించి సెట్స్ లో కూడా అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది సౌందర్య.అయితే పైకి చాలా అందంగా  కనిపించే ఈమె అంత సాఫ్ట్ అమ్మాయి కాదట. ప్రశాంతంగా ఉన్నంత వరకు ఈమె అంత మంచి అమ్మాయి ఎవరు ఉండరు. కానీ ఒక్కసారి సౌందర్య కి కోపం వస్తే ఎవరైనా సరే ఆమె కోపానికి బలైపోవాల్సిందేనట.

 ముఖ్యంగా సినిమా షూటింగ్స్ సమయంలో ఎవరైనా తనకు కోపం తెప్పించిన తనకి నచ్చని పనులను చేసిన వారిపై మండిపడేదట సౌందర్య. ముఖ్యంగా సౌందర్య తో కలిసి నటించిన వారు సినిమాకి సంబంధించిన వ్యక్తులు సౌందర్య కి ఇంతటి కోపం ఉంది అంటూ తెలియజేశారు. కోపం వచ్చినప్పుడు ఆమెకి దూరంగా ఉంటారట చాలామంది. అంతేకాదు తనకి కోపం వస్తే తల్లిదండ్రుల మీద సైతం అరిచేదట సౌందర్య. అంతే కాదు తనకు కోపం వచ్చినప్పుడు సౌందర్య  తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడింది అంటూ తన తోటి నటీనటులు చెప్పుకొచ్చారు. ఏదేమైనాప్పటికీ ఒక గొప్ప నటిని ఇండస్ట్రీ కోల్పోవడం తీరని లోటు అనే చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: