కోలీవుడ్ స్టార్
హీరో విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమధ్య వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు విజయ్.
విజయ్ సినిమాలు అవలీలగా 100కోట్లు మార్క్ ను కొల్లగొడుతుంటాయి.తాజాగా
విజయ్ వారిసు (వారసుడు) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ
మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వారసుడు
సినిమా తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తమిళనాడులో
జనవరి 11 వ తేదీన విడుదలైంది. ఇక తెలుగులో
జనవరి 14 వ తేదీన రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి మొదటి షో నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయిన
సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ పర్వాలేదనిపిస్తుంది. ఈ మూవీలో
విజయ్ సరసన
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.వారసుడు కు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఇప్పుడు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక వారసుడు
సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటింది.
సంక్రాంతి పండక్కి తెలుగులో భారీ పోటీ ఉన్నప్పటికీ వారసుడు
సినిమా రిలీజ్ అయ్యింది.
ఇక ఈ
మూవీ 7 రోజులకు 150కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి 210కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత
విజయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించడంతో ఆయన అభిమానులు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారసుడు సినిమాతో
దళపతి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారని అభిమానులు చెబుతున్నారు. అయితే ఇవి నిజమైన వసూళ్లు కావంటూ
నెటిజన్స్ వాదన.
సినిమా తమిళ్ నాడులో యావరేజ్ అని తెలుగులో బిలో యావరేజ్ అని ఈ సినిమాకి వసూళ్లు కూడా తక్కువగా వచ్చాయని
నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. తమిళనాట కూడా ఈ
సినిమా సీరియల్ లా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో
వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో యాంకర్ పై సీరియస్ కూడా అయ్యాడు.