లవ్ టుడే హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
గతేడాది విడుదలైన లవ్ టుడే సినిమా ఎంతటి ఆదరణను పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా  ఈ సినిమాకి యూత్ ఎంతగా కనెక్ట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లవర్స్ మధ్య జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ప్రదీప్ రంగనాథ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించిన జరిగింది. ఈ సినిమాలో ఆయన నటన ఎంతో న్యాచురల్ గా ఉండడంతో ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది.

ఇక ఈ సినిమాలో ఆయనకి జంటగా ఇవాన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమాలో సత్యరాజ్ , రాధిక మరియు తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికి ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఇవాన నటనకి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే అసలు ఇవాన  ఎవరు అని ఆరాధిస్తున్నా రు చాలామంది విశ్లేషకులు. అయితే ఇవాన అసలు పేరు అలీనా షాజీ. ఈ క్రమంలోనే తన పేరు పలకడం చాలా కష్టంగా ఉంది అని ఇవన అని మార్చుకుంది ఈమె.

కేరళకు చెందిన ఈమెకి  ప్రస్తుతం 22 సంవత్సరాలు. ఇకపోతే ఈమెకి 2018లో తమిళ్ డబ్బింగ్ సినిమా ఝాన్సీ తో తెలుగులో పరిచయమైంది. ఇక ఈ సినిమాలో ఇవాన డి గ్లామర్ పాత్రలో కనిపించింది. అలాగే దాని అనంతరం 2012లో మాస్టర్స్ వచ్చిన మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ మంచి క్రేజ్ ని అందుకుంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో నటిస్తుంది అని ఈ సినిమాతో ఈమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా ఒక తెలుగు హీరో సరసన హీరోయిన్గా నటించనుంది అని తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: