మొన్నే సినిమా వచ్చింది.. అప్పుడే జబర్దస్త్ స్పూఫ్ చేశారు?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి బుల్లితెర  ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ పంచుతూ ప్రస్తుతం చిరు నవ్వులకు చిరునామాగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇకపోతే జబర్దస్త్ కేవలం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడం కాదు అటు ఎంతో మంది అప్కమింగ్ కమీడియన్స్ కి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్స్ తో అటు జబర్దస్త్ కమెడియన్స్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటారు.

 ఇకపోతే ఇక కొత్తగా వచ్చిన ఎన్నో సినిమాలను స్పూఫ్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే పవర్ ఫుల్ డైలాగ్ లకు సైతం కామెడీ పంచులు జోడించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించటం  లాంటివి చేస్తూ ఉంటారు జబర్దస్త్ కమెడియన్స్. అయితే కేవలం పాత సినిమాలను మాత్రమే స్పూఫ్ చేయడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల రిలీజ్ అయ్యి వారం కూడా కాకముందే ఒక సినిమాను జబర్దస్త్ కమెడియన్స్ స్పూఫ్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా.

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో బాబీ దర్శకత్వం లో తరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకం  గా చెప్పాల్సిన పని లేదు. అయితే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ప్రస్తుతం దూసుకు పోతుంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాను జబర్దస్త్ కమెడియన్స్ స్పూఫ్ చేశారు. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో చూసుకుంటే గెటప్ శ్రీను అటు చిరంజీవి పాత్ర లో వస్తే.. రాంప్రసాద్ రవితేజ పాత్రను చేశారు. ఈ క్రమం లోనే తనదైన పంచు డైలాగుల తో స్పూఫ్ చేసి ప్రేక్షకులను నవ్వించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: