పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరో గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా రోజు రోజుకి మంచి ఆదరణ పొందుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంతటి బలాన్ని సమకూర్చుకుందో ఇప్పుడు దాని కంటే పది రెట్లు ఎక్కువ సంపాదించుకుంది. ఇక రోజురోజుకీ జనసేన పార్టీకి ఆదరణ బలం కావడంతో అది చూసి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాడు. కమెడియన్ పృద్వి గతంలో వైసిపి పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. దాని అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి రావడం జరిగింది.
తాజాగా జబర్దస్త్ టాప్ కమెడియన్ హైపర్ ఆది సైతం యువశక్తి సభకి వచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలిచాడు. ఇందులో భాగంగానే వైసిపి పార్టీని ఏకి పారేశాడు. హైపర్ ఆది చేసిన ఆ కామెంట్లు కాస్త రాజకీయాల్లో పెను దుమారమే రేపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక దీనిపై తాజాగా మంత్రి రోజా సైతం స్పందించింది.ఆమె హైపర్ ఆది గురించి మాట్లాడుతూ.. హైపర్ ఆది లాంటివాళ్ళు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. వాళ్లేదో చిన్న చిన్న షోలు చేసుకుంటూ.. సినిమాలో నటిస్తూ ఉంటారు.. మెగాస్టార్ కుటుంబంలో ఇప్పటికే 7 మంది హీరోలు ఉన్నారు. వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే సినిమాల్లో అవకాశాలు రావేమో అన్న కారణంగా హైపర్ ఆది అలా మాట్లాడాడు..
కేవలం భయంతో మాత్రమే ఆ పార్టీని హైపర్ ఆది సపోర్ట్ చేస్తున్నాడు.. అది ప్రేమతో చేసే సపోర్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే రోజా మాట్లాడిన మాటలు కాస్త సోషల్ మీడియా వేదిక వైరల్ అవ్వగా.. దీనిపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ రోజాకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. నన్ను ఎప్పుడు మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ పార్టీలో చేరమని గాని అడగలేదు.. చిన్న ఆర్టిస్ట్ ఏ లే కదా అంత భయపడాల్సిన అవసరం లేదు.. అంటూ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు బ్రహ్మాజీ. అంతే కాదు ఒకప్పుడు అధికార పార్టీపై గొంతెత్తి మాట్లాడడానికి భయపడే సినిమా ఆర్టిస్టులు కాస్త ఇప్పుడు వైసీపీ పార్టీపై మండిపడుతున్నారు.. అంటే సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ మొత్తం పవన్ కళ్యాణ్ కి ఉంది కాబట్టి అని చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది ..!!