ఈసారి కూడా హిట్టు కొట్టేలా కనిపిస్తున్న సుహాస్..!
ట్విట్టర్ వేదికగా రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లింక్ ను షేర్ చేసిన మహేష్ మీరు ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెబుతూనే.. నిర్మాతలు శరత్ చంద్ర , అనురాగ్ రెడ్డి లను ట్యాగ్ చేశారు మహేష్ బాబు. అలాగే హీరో సుహాస్, హీరోయిన్ టీనా శిల్పా రాజ్ లకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చూడడానికి చాలా ఆసక్తిగా ఉన్నానంటూ కూడా ఆయన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేయడంతో చిత్ర యూనిట్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుంది. అంతేకాదు సుహాస్ కూడా మహేష్ బాబు తన సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడంతో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ వెల్లడిస్తున్నారు.
అప్పుడు పోకిరి సినిమా కోసం అలంకార్ థియేటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ నా చొక్కా చిరిగిపోయింది.. ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన తర్వాత నా చొక్కా నేనే చింపుకునే అంత ఆనందంగా ఉన్నాను.. అంటూ తన ఆనందాన్ని వెల్లడించారు. ఇకపోతే మహేష్ బాబు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు అంటే కచ్చితంగా సుహాస్ ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తాడు అని నమ్మకం కుదిరింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు జనవరి 3వ తేదీన రానున్నట్లు సమాచారం.