బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే ఇంకా జాన్ అబ్రహం మెయిన్ రోల్స్ లో బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రిలీజ్ అయిన సినిమా పఠాన్.కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ముందు నుంచే ఈ సినిమాపై ఒక రేంజిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల జనవరి 25 వ తేదీన పఠాన్ సినిమా చాలా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజయింది.ఇక ఇది ఫుల్ యాక్షన్ సినిమా కావడం పైగా షారుఖ్ చాలా రోజుల తర్వాత తెరపై కనపడటంతో మొదటి రోజు నుంచే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ సెట్ చేసింది ఈ సినిమా. ఇప్పటికే రిలీజయిన మూడు రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి మరింత స్పీడ్ గా దూసుకుపోతుంది. కింగ్ ఈజ్ బ్యాక్ ఇంకా బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు నార్త్ ఇండియన్స్. ఇప్పటికే పలు రికార్డులు సృస్తిస్తున్న పఠాన్ సినిమా ఓ రెండు రికార్డులని మాత్రం ఇంకా దాటలేకపోయింది. ఆ రెండు రికార్డులు కూడా మన బాహుబలి ఇంకా rrr సినిమాల మీదే ఉండటం గమనార్హం.రిలీజ్ మొదటి రోజు అత్యధికంగా టికెట్లు అమ్ముడైన హిందీ భాష సినిమాల్లో బాహుబలి 2 సినిమా మొదటి ప్లేస్ లో ఉంది.
బాహుబలి 2 డబ్బింగ్ హిందీ వర్షన్ సినిమాకి మొదటి రోజు ఏకంగా 6 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటి దాకా ఇదే హైయెస్ట్ గా ఉంది. పఠాన్ సినిమాకి ఉన్న క్రేజ్ చూసి ఈ రికార్డుని దాటేస్తుంది అనుకున్నారు అందరూ కూడా. కానీ పఠాన్ సినిమా మొదటి రోజు మొత్తం 5 లక్షల 56 వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయి ఇక రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రికార్డు ఇంకా మన బాహుబలి పేరు మీదే ఉంది. బాహుబలి మొదటి స్థానంలో ఉండగా పఠాన్ సినిమా రెండో స్థానంలో ఉండగా kgf 2 ఇంకా వార్ సినిమాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.అలాగే ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల్లో కూడా పఠాన్ సినిమా రికార్డుని సెట్ చేయలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మొదటి రోజు ఏకంగా 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో rrr సినిమా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత బాహుబలి 2, kgf 2, సాహో ఇంకా రోబో 2 సినిమాలు ఉన్నాయి. పఠాన్ సినిమా ఐదో స్థానంలో ఉండటం విశేషం. పఠాన్ సినిమా మొదటి రోజు కేవలం 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ రికార్డుని కూడా బద్దలుకొట్టలేకపోయింది పఠాన్ సినిమా. ఈ రెండు రికార్డులు కూడా మన బాహుబలి 2 ఇంకా rrr సినిమాలకే ఉండటం మరో విశేషం.మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత మేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.