మొదటి భర్త గురించి షాకింగ్ నిజాలను బయటపెట్టిన పవిత్ర..!?

Anilkumar
పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది పవిత్ర లోకేష్. తల్లి అత్త పిన్ని వండి పాత్రలలో నటించి చాలా పద్ధతిగా కనిపిస్తుంది ఈమె. చూడ చక్కనైన రూపంతో కనిపించే ఈమె సీనియర్ హీరో నరేష్ తో సహజీవనం చేస్తుంది. దీంతో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమెపై ఒక్కసారిగా నెగిటివిటీ పెరిగిపోయింది. అయితే ఇప్పటికే మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న సీనియర్ నటుడు నరేష్ ని నాలుగో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది పవిత్ర లోకేష్. ఇందులో భాగంగానే కొందరు నెటిజన్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. 

ఎందుకంటే పవిత్ర లోకేష్ మాట్లాడే మాటలపై కొంచెం కూడా జనాలకి నమ్మకం లేదు. వీరిద్దరూ ఎప్పటికీ పెళ్లి చేసుకోరు అనడానికి ఇదే ముఖ్య కారణం అని కూడా చాలామంది అంటున్నారు. అయితే గతంలో సీనియర్ నటుడు నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి చాలా గొప్పగా చెప్పడం మనం విన్నాం. కానీ ఇప్పుడు మాత్రం సీనియర్ నటుడు నరేష్ ఎవరు ఊహించిన విధంగా తన భార్యపై ఆరోపణలను చేస్తున్నారు.అయితే పవిత్ర లోకేష్ కూడా ఇప్పుడు అలాగే గతంలో ఆమె భర్త సుచిత్ర ప్రసాద్ దేవుడు అంటూ కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ తన భర్త గురించి మాట్లాడుతూ.. కొన్ని కామెంట్లను చేయడం జరిగింది.

ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. మేమిద్దరం కలిసి సీరియల్స్ లో నటించాము అని.. అప్పుడే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని.. మొదట మా ఇద్దరి మధ్య స్నేహం ఉండేది అని..ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అని ..అనంతరం మేమిద్దరం ఒకటయ్యాము అంటూ తెలియజేసింది పవిత్ర లోకేష్. అంతేకాదు నా భర్త సుచ్చేంద్రప్రసాద్ చాలా గొప్ప వ్యక్తి అని.. నాతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా మంచివాడు అని.. చాలా బెటర్ అని కూడా తెలియజేస్తుంది. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా ఇప్పటివరకు నేను చూడలేదు అని.. నా అభిప్రాయాలను ఆయన ఏమాత్రం ఎదురు చెప్పకుండా గౌరవిస్తాడు అంటూ చెప్పకు వచ్చింది. అంతే కాదు ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాల గురించి అసలు మేము ఎప్పుడూ మాట్లాడము అంటూ తన మొదటి భర్త గురించి తెలియజేసింది పవిత్ర లోకేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: