పాన్
ఇండియా టాప్ దర్శకుడు రాజమౌళి,
సూపర్ స్టార్ మహేష్ బాబు
సినిమా కాంబోలో పాన్ వరల్డ్
సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ
సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఈ
సినిమా గురించి ఏదొక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఏ న్యూస్ వినిపించిన అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక తాజాగా మరో కొత్త న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మార్చి నెలలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ముహూర్తం కుదిరిందని సమాచారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్
శ్రీనివాస్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి
మార్చి నెల నుంచి మహేష్.
రాజమౌళి సినిమాకి డేట్లు ఇస్తాడో ? లేదో చూడాలి.ఇక ఈ సినిమాకి నటీనటుల ఇంకా ఎంపిక జరగలేదు.
కాకపోతే.. ఈ
సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథలో కథానాయకగా మంచి క్రేజ్ ఉన్న
హీరోయిన్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం తెలిసింది. అయితే
రాజమౌళి తాజాగా విదేశీ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాని ఒక వండర్ఫుల్ గ్లోబల్ అడ్వెంచర్‌గా చెక్కాలని చెప్పారు. అందుకే ఇక విజయేంద్రప్రసాద్ ఫర్ ది ఫస్ట్ టైం
సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టుని రాశారట. ఈ
సినిమా ఖచ్చితంగా అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సాగుతుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో
హాలీవుడ్ రేంజిలో గుర్తింపు పొందిన
రాజమౌళి ఖచ్చితంగా తను తరువాత చేయబోయే
సినిమా ఇంకా హై లెవెల్ లో వుండాలని భావిస్తున్నాడు. అందుకే మహేష్ తో చేసే
సినిమా బిగ్గెస్ట్
ఇండియన్ ఫిల్మ్ గా తెరకెక్కించాలని
రాజమౌళి కంకణం కట్టుకున్నాడు.మహేష్, -
రాజమౌళి కలయికలో గ్లోబల్ అడ్వెంచర్
థ్రిల్లర్ వస్తే అది ఖచ్చితంగా అది అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.ఈ సినిమాతో
హాలీవుడ్ సినిమాల రికార్డులను కూడా జక్కన మహేష్ బద్ధలు కొట్టడం ఖాయమటా..