#SSMB28 : భారీ ధరకు ఓటీటీ రైట్స్..ఎన్ని కోట్లంటే..?

Divya
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగా బజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ ప్రేమికులలో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా గురించి చిన్న చిన్న అప్డేట్లు వదులుతూ అభిమానులకు ఊరట కలిగిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఆసక్తికరంగా మారింది.
SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు ఫిలిం వర్గాలు అందించిన తాజా సమాచారం.  ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్ విడుదల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందట. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇదే నిజమైతే మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ ఓటీటీ స్పేస్ లో అత్యంత ధర పలికిన చిత్రాల జాబితాలో నిలుస్తుంది. మహేష్ బాబు సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీలా కూడా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవరనాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మహేష్ సినిమా కోసం తమన్ ప్రత్యేక సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: