ఆ సినిమాలో కాజల్ కి కూతురిగా నటిస్తున్న శ్రీ లీల..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది శ్రీ లీల. ఒక్క సినిమాతో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది ఈమె. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా కూడా ఈమె పేరు వినిపిస్తుంది. ఇటీవల ధమాకా సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఒక కీలకపాత్రలో నటించనుంది శ్రీ లీల.అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీలా బాలకృష్ణ కూతురుగా కనిపించబోతుంది అన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూనే ఉన్నాయి. 

అయితే శ్రీలలకి రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీ లీల క్రేజ్ పెరుగుతున్న సమయంలోనే కాజల్ అభిమానులు భయపడుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రానున్న సినిమాలో కాజల్ కూడా నటిస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.కాజల్ ఈ సినిమాలో బాలకృష్ణకు భార్య పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీ లీలా నటిస్తోంది. అంటే కాజల్ కూతురుగా శ్రీ లీల ఈ సినిమాలో కనిపించబోతుందన్నమాట. ఇక ఇటీవల ధమాకా సినిమాలో రవితేజను డామినేట్ చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

దీంతో అలాంటి స్టార్ హీరోని డామినేట్ చేసి అందరి దృష్టిని తనవైపు ఆకర్షించుకున్న ఈమె ఇప్పుడు కాజల్ పక్కన కనిపిస్తే ఎలా ఉంటుందో అని కాజల్ అభిమానులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం చాలానాళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది.ఈ సినిమా కాజల్ కి చాలా కీలకం అవ్వబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో శ్రీ లీలా కాజల్ ని డామినేట్ చేస్తే కాజల్ పరిస్థితి ఏంటి అని కంగారుపడుతున్నారు కాజల్ అభిమానులు.కానీ వీటన్నింటిని పట్టించుకోని కాజల్ బాలకృష్ణ సరసన ఈ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. దీంతో అందరూ... కాజల్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నందుకు షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: