ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆఖరిగా ఫ్లాప్ సినిమాలలో నటించిన హీరోలు సైతం ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ఆది పురుష్ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయిన అనంతరం ఇతర సినిమాల పనిలో పడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కే జి ఎఫ్ ఫెమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ మరియు నాగర్శ్విన్ అత్యంత భారీ స్థాయిలో టైం ట్రావెల్ కథతో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కె తో పాటు
మారుతి తరకెక్కిస్తున్న హారర్ సినిమాలో సైతం నటిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ఈ మూడు ప్రాజెక్టులలో కూడా ఒకేసారి నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కె షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఒక్కో సినిమాకి గాను 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ 100 కోట్లకు మించి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ఈ మూడు సినిమాల అనంతరం ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పిరిట్ సినిమాను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆ సినిమాతో పాటు బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా సిద్ధార్థ ఆనంద్ పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్ళని రాబడుతుంది. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరింది. రానున్న రోజుల్లో ఊహించిన విధంగా ఈ సినిమా వసుళ్ళని రాబడుతుందని అందురు భావిస్తున్నారు..!!