టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్‌బాబు - టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రానున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫలితం గురించి జోస్యం చెప్పిన ఓ నెటిజన్‌పై చిత్ర నిర్మాత నాగవంశీ అసహనంని వ్యక్తం చేశారు. ఇక వంశీకి ఉన్న ఎటకారం గురించి తెలిసిందేగా.. వెంటనే ఆగలేక రానున్న ప్రపంచ కప్ ఫలితం ఎలా ఉండనుందో అంచనా వేసి చెప్పమంటూ కూడా అతనిపై వంశీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. '' సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో 'బ్రహ్మోత్సవం' సినిమా ఓ పెద్ద ఫ్లాప్. ఆ సినిమా తర్వాత వచ్చిన 'స్పైడర్' సినిమా కూడా మరో ఫ్లాప్‌గా మిగిలింది. ఇలా వరుస ప్లాపులు ఇచ్చిన హీరో.. ఆ తర్వాత ఆరు సినిమాలతో వరుసగా హిట్ లు అందుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు అంటూ 1. భరత్ అనే నేను, 2. మహర్షి, 3. సరిలేరు నీకెవ్వరు, 4. సర్కారు వారి పాట, 5. SSMB 28 (త్రివిక్రమ్-మహేశ్.. డీసెంట్ హిట్ మూవీ) 6.SSMB 29 (రాజమౌళి-మహేశ్.. ఇది పక్కా బ్లాక్ బస్టర్ )'' అని అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
అయితే తమ చిత్రాన్ని కేవలం హిట్ అని మాత్రమే పేర్కొనడంపై నిర్మాత నాగవంశీ బాగా అసహనం వ్యక్తం చేశారు. ''అంటే.. నిర్మాణ దశలో ఉన్న సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో కూడా మీరే జోస్యం చెప్పేస్తారన్నమాట. #SSMB 28 జస్ట్ ఒక డీసెంట్ హిట్ మూవీ మాత్రమే అవుతోందని మీరు డిసైడ్ చేసేశారు. నా తరఫు నుంచి మీకు ఓ చిన్న విన్నపం..మీకు వీలుంటే రానున్న వరల్డ్ కప్ ఫలితాన్ని కూడా అంచనా వేసి చెప్పండి'' అని వ్యంగ్యంగా కౌంటర్ ఏసాడు. ఇక SSMB 29కి పక్కా బ్లాక్‌బస్టర్ అని చెప్పి.. తమ సినిమాని కేవలం హిట్ అని చెప్పడం వల్ల నాగవంశీ హర్ట్ అయ్యి ఒకింత అసహనానికి గురయ్యాడు.అందుకే ఇలా కామెంట్ చేశాడు.