బాహుబలి2 రికార్డులను చేరిపేసి పనిలో ఆర్ఆర్ఆర్?

Purushottham Vinay
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ కి మొట్టమొదటి సారి 1000 కోట్ల వసూళ్ల నెంబర్ ను చూపించిన సినిమా బాహుబలి 2 అనే సంగతి దేశంలోని ప్రతి సినీ ప్రేక్షకుడికి తెల్సిందే. బాహుబలి 2 సినిమా సినిమా ఏకంగా రూ.1800 కోట్ల  వసూళ్లు చేసి అనేక రికార్డులు తిరగరాసింది.అసలు ఆ సినిమా వసూళ్లను  అసలు ఏ సినిమా కూడా బ్రేక్ చేయడం కాదు కదా దాని దారిదాపుల్లోకి కూడా రాలేదు. తరువాత బాలీవుడ్లో ప్లాన్ చేసి అమీర్ ఖాన్ దంగల్ సినిమాని చైనాలో రిలీజ్ చేసి 2000 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు పోస్టర్ వేసుకున్నాడు. అయితే జనాలు దంగల్ వసూళ్ళని నమ్మలేదు. అలాగే కొన్ని బాలీవుడ్ మీడియా సైట్స్ కూడా దంగల్ వసూళ్లు ఫేక్ అని అప్పట్లో ప్రచారం చేశాయి. దంగల్ వసూళ్లు నిజమో కాదో తెలీదు కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి రికార్డుల దారిదాపుల్లోకి ఏ సినిమా రాకపోయింది.


బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా 1300  కోట్లకు పైగా వసూళ్లు చేసిన సంగతి తెల్సిందే. కానీ ఆ వసూళ్ల వద్దే ఆర్ఆర్ఆర్ నిలిచి పోయింది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా నామినేషన్స్ ను దక్కించుకుంది. దాంతో మళ్లీ అమెరికాతో పాటు పలు దేశాల్లో కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా మళ్లీ విడుదల అవ్వబోతుంది. జపాన్ లో అయితే ఏకంగా వంద రోజులు  ఆడింది.అక్కడ సాధించిన వసూళ్లతో పాటు ముందు ముందు అమెరికా ఇంకా ఇతర దేశాల్లో మళ్లీ విడుదల అయితే వచ్చే వసూళ్లను కలిపితే కచ్చితంగా బాహుబలి 2 సినిమా  వసూళ్లను ఆర్.ఆర్.ఆర్ బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: