కార్తీ కోసం ఐటెం సాంగ్ లో మెరవనున్న రష్మిక..!
ఇందులో తెలుగు నటుడు సునీల్ , దర్శకుడు విజయ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకం పై ఈ సినిమాను ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై కూడా ఒకరకంగా అంచనాలు నెలకొన్నాయి తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాలలో పూర్తి చేసారు. రెండవ షెడ్యూల్ కూడా జనవరి రెండవ వారం నుంచి కేరళలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ఈ పోస్టర్ కి మంచి స్పందన లభించిందని చెప్పవచ్చు.
ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరొక విషయం ఏమిటంటే.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఐటమ్ సాంగ్ లో చేయబోతుందంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడ లేదు కానీ రష్మికాను ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి కార్తీ ఒప్పించారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం ఉందో తెలియాలి అంటే సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికైతే కార్తీ కోసం రష్మిక ఐటమ్ సాంగ్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో కథనాల ద్వారా వార్తలు వెలువడుతున్నాయి.