సహజీవనం మాత్రమే.. పెళ్లి చేసుకోము అంటున్న సిద్ధార్థ్ - అధితి..!?

Anilkumar
ఒకప్పుడు లవర్ బాయ్ గా మెరుపులు మెరుపుంచిన హీరో ఎవరన్నా ఉన్నారు అంటే మొదటిగా వినిపించే పేరు హీరో సిద్ధార్థ్. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తన రేంజ్ ని మరింత పెంచుకున్నాడు సిద్ధార్థ్. ఆ సినిమాల అనంతరం ఆయన చేసిన పలు సినిమాలు ఫ్లాప్ అవడంతో సిద్ధార్థ ఇమేజ్ తగ్గిపోయింది. అయినప్పటికీ అడపాదడబా అవకాశాలతో ఏవో కొన్ని కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నాడు ఈయన. అయితే ఇదిలా ఉంటే దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మహాసముద్రం సినిమాతో మళ్ళీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు సిద్ధార్థ్. 

ఆ సినిమాకి గాను సిద్ధార్థ్ 8  కోట్లకు పైగా అన్ని రెమ్యూనరేషన్ను తీసుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది... మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కవచ్చు అని భావించినప్పటికీ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. సినిమా డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఆ సినిమా వల్ల హీరోయిన్ అతిథి రావు హైదరి తనకి పరిచయమైంది. ఈ సినిమాతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు వీరిద్దరూ. అనంతరం ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు సహజీవనం వరకు వచ్చింది. ఇక ఈ విషయాన్ని ఇద్దరు కూడా కోలీవుడ్ మీడియా ఎదుట చాలా ఓపెన్ గా బయటపెట్టారు.

అయితే ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థ వేడుకల్లో వీరిద్దరూ కలిసి వచ్చి ఒకసారి గా అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నప్పటికీ వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదని టాలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరు పెళ్లి చేసుకోనట్లుగా చెబుతున్నారు. అయితే గతంలో వీరిద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు జరిగాయి.అనంతరం విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న కారణంగా వీరిద్దరికీ సహజీవనమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఇలా సహజనం చేస్తూ ఎన్నాళ్ళు కొనసాగిస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: